జిల్లాలో జనప్రభంజనం పోటెత్తుతోంది

వైయస్‌ జగన్‌ హామీలతో ప్రజల్లో ధైర్యం
వైయస్‌ఆర్‌ సీపీ నర్సాపురం పార్లమెంటరీ అధ్యక్షుడు ప్రసాదరాజు
పశ్చిమ గోదావరి: పశ్చిమలో ప్రజా సంకల్పయాత్రకు జనప్రభంజనం పోటెత్తుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నర్సాపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు ఊహించని విధంగా జిల్లాలో స్పందన లభిస్తోందని అన్నారు. పాదయాత్రలో ప్రసాదరాజు మీడియాతో మాట్లాడుతూ.. ఒక రాజకీయ నాయకుడిని జనం ఇంత ఆదరించడం ఒక్క వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబానికే దక్కుతుందన్నారు. ప్రతీ ఒక్కరి సమస్యలు వింటూ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారని, ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపుతూ.. రేపు వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలను చెబుతూ అందరిలో భరోసా నింపుతున్నారన్నారు. ఆక్వా రైతులకు ఇచ్చిన రూ. 1కి యూనిట్‌ కరెంట్‌ హామీ, తీర ప్రాంతాల్లోని మత్స్యకారులకు కార్పొరేషన్, డెల్టా ఆధునీకరణ, తాగునీటిపై జననేత స్పందించన విధానంతో గోదావరి జిల్లా ప్రజలకు నమ్మకం ఏర్పడిందన్నారు. వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలంతా ఎదురుచూస్తున్నారన్నారు. 
Back to Top