బాబు హయాంలో చేతివృత్తులు అంతం


వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు పొన్నాడ సతీష్‌
తూర్పు గోదావరి: చంద్రబాబు హయాంలో చేతివృత్తులు అంతమవుతున్నాయని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు పొన్నాడ సతీష్‌ విమర్శించారు. ఎన్నికల సమయంలో మత్స్యకారులకు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత మరిచిపోయారని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఒక్కరే మత్స్యకారులకు అండగా ఉండేవారన్నారు. మత్స్యకారులకు వేట లేని పరిస్థితి నెలకొందన్నారు. రజకులు, నాయిబ్రహ్మణుల వృత్తులు అంతమవుతున్నాయని చెప్పారు. చంద్రబాబు మత్స్యకారులను ఓటు బ్యాంకుగానే చూశారని మండిపడ్డారు. అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదని, మత్స్యకారులకు ప్రత్యామ్నయం చూపిన తరువాతే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. వైయస్‌ జగన్‌ మాట తప్పరు..మడమ తిప్పరని చెప్పారు. ప్రతిరోజు చావుతో పోరాడే మత్స్య్కరులకు పరిశ్రమలు వస్తే జీవితాలు బాగుపడుతాయని, ఇందుకోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. రూ.40 వేల కోట్లతో రిలయన్స్‌ కంపెనీ ఓ పరిశ్రమ స్థాపించి..40 మందికి కూడా స్థానికులకు ఉపాధి కల్పించలేదన్నారు. మొక్కలకు నీరు పోసేందుకు కూడా మత్స్యకారులు పనికి రారా అని ప్రశ్నించారు. గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం సంస్థలో కూడా స్థానికులకు ఉద్యోగాలు లేవని చెప్పారు. దేశ చరిత్రలోనే 103 రోజుల పాటు ఓ కంపెనీపై ఉద్యమించి, నష్టపరిహారం కింద రూ.130 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. 
 
Back to Top