బాబును గద్దె దించేందుకు ఎదురుచూస్తున్న ప్రజలు

2019లో వైయస్‌ఆర్‌ సీపీ విజయం ఖాయం
ఆదివాసీలకు మేలు చేసిన నాయకుడు మహానేత వైయస్‌ఆర్‌
వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత పేట్ల ఉమాశంకర్‌ గణేష్‌
విశాఖపట్నం: చంద్రబాబును గద్దె దించేందుకు ప్రజలంతా ఎదురుచూస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పేట్ల ఉమాశంకర్‌గణేష్‌ అన్నారు. 2019 ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం.. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 240వ రోజు ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న ఉమాశంకర్‌ గణేష్‌ మీడియాతో మాట్లాడారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజలు వేలాదిగా తరలివచ్చి వైయస్‌ జగన్‌ అడుగులో అడుగు వేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో వైయస్‌ జగన్‌ సీఎం అయిన తరువాత నర్సీపట్నం నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారన్నారు. అదే విధంగా దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆదివాసీల సంక్షేమానికి కృషి చేశారన్నారు. కానీ చంద్రబాబు సర్కార్‌ ఆదివాసీల పట్ల వివక్ష చూపుతోందని మండిపడ్డారు. జననేత ముఖ్యమంత్రి అయితే వెనుకబడిన గిరిజన ప్రాంతాలు బాగుపడతాయన్నారు. నాలుగేళ్లుగా యువత, నిరుద్యోగులను పట్టించుకోని చంద్రబాబు జ్ఞాన భేరీల పేరుతో యూనివర్సిటీలకు పసుపు జెండాలతో ప్రవేశించి మరోసారి మభ్యపెట్టేందుకు చూస్తున్నారన్నారు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు చేతిలో మోసపోయిన నిరుద్యోగులు, విద్యార్థులు ఎప్పుడు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. ఓటనే ఆయుధంతో చంద్రబాబును ఎప్పుడు గద్దె దించాలా అని ఎదురుచూస్తున్నారన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top