కోనసీమలో తీవ్ర నీటి సమస్య

తూర్పుగోదావరి: కోనసీమ ప్రాంతంలో తీవ్ర నీటి సమస్య ఉందని మాజీ మంత్రి పెనిపే విశ్వరూప్‌ అన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్ర 188వ రోజు రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా విశ్వరూప్‌ మీడియాతో మాట్లాడారు. లక్ష మంది పై చిలుకు మంది నిన్న వైయస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగిందన్నారు. గోదావరి బ్రిడ్జి ఊగడం చరిత్రలో ఇదే మొదటిసారి అన్నారు. కోనసీమ ముఖద్వారమైన కొత్తపేటలో కూడా వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలుకుతామన్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారాలను అన్వేషిస్తున్నామని, వైయస్‌ జగన్‌ సీఎం కాగానే వీటన్నింటిని పరిష్కరిస్తామని చెప్పారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో కోనసీమలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు అమలాపురం నియోజకవర్గానికి రూ.120 కోట్లతో మంచినీటిని అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. రూ.500 కోట్లు ఖర్చు పెడితే కోనసీమలో నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ సమస్యలన్నింటిని వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు.
 
Back to Top