స్థానిక సమస్యలను వైయస్‌ జగన్‌ దృష్టికి తెచ్చాం

ఇచ్చిన హమీలతో పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అని పిఠాపురం వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త పెండెం దొరబాబు అన్నారు. చంద్రబాబు సర్కార్‌ ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెడుతుందని ఆయన విమర్శించారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు అందిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. పాదయాత్రగా తమ నియోజకవర్గానికి వచ్చిన వైయస్‌ జగన్‌కు స్థానిక సమస్యలు వివరించామన్నారు. ఆ సమస్యల పరిష్కారం వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని దొరబాబు పేర్కొన్నారు. నాడు తాను బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎంతో సహకారం అందించారని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. 
 
Back to Top