ఏపీని నాశనం చేసింది టీడీపీ, బీజేపీ

చంద్రబాబు అక్రమాలను ప్రజల్లో ఎండగట్టాలి
హోదా కోసం నాలుగేళ్లుగా పోరాడుతోంది వైయస్‌ఆర్‌సీపీనే
రొంపిచర్ల, పులిచర్ల మండలాల బూత్‌ కమిటీ సమావేశంలో పెద్దిరెడ్డి
చిత్తూరు: బీజేపీ, టీడీపీ చేతులు కలిపి రాష్ట్రాన్ని నాశనం చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను సాధించలేని చంద్రబాబు.. రాష్ట్ర వనరులను విచ్చలవిడిగా దోచుకుతింటున్నాడని మండిపడ్డారు. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని రొంపిచర్ల, పులిచర్ల మండలాల బూత్‌ కమిటీ కన్వీనర్ల సమావేశం పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ నిర్ణయం ప్రకారం ఎన్ని కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లామని, గ్రామస్థాయి నుంచి మండలం, నియోజకవర్గ పరిధిలోని అన్ని కమిటీలు బాగా పనిచేస్తేనే మంచి మెజార్టీ పొందవచ్చని వారికి సూచించారు. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ వీరోచిత పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. పార్టీ ఎంపీలు హోదా సాధన కోసం వారి పదవులు వదులుకొని ప్రాణాలకు తెగించి దీక్షలు చేశారన్నారు. హోదా కోసం పోరాడుతున్న వారిని చంద్రబాబు సర్కార్‌ జైలుపాలు చేసిందని, ప్రజల్లో హోదా పోరు ఉధృతం కావడంతో యూటర్న్‌ తీసుకొని మరోసారి ప్రజలను మోసం చేయడానికి చూస్తోందన్నారు. 

తెలుగుదేశం పార్టీ అక్రమాలను, చంద్రబాబు, లోకేష్‌ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని పెద్దిరెడ్డి బూత్‌ కమిటీ కన్వీనర్లకు సూచించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ఎంత మోసం చేశాడో.. మోడీ అంతే మోసం చేశారన్నారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే కిరణ్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరారన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలతో చంద్రబాబు చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని వైయస్‌ఆర్‌ సీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. 
Back to Top