ఉద్యోగ, ఉపాధ్యాయులకు వైయస్‌ఆర్‌సీపీ అండ
విజయవాడ:  ఉద్యోగ, ఉపాధ్యాయులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని, చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెర్చలేదని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. డిమాండ్లపై ఉద్యమిస్తే టీచర్లను అరెస్టు చేసి జైళ్లలో ఉంచడం దుర్మార్గమన్నారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే సీపీఎస్‌ రద్దు చేస్తామని ప్రకటించారని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తామన్నారు. వైయస్‌ జగన్‌ ప్రకటనను అందరూ స్వాగతిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు తాను ఇచ్చిన హామీలనే మర్చిపోయారని విమర్శించారు. 
 
Back to Top