బాబు పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదుఅక్కచెల్లమ్మల కంట కన్నీరుపెట్టించిన దుర్మార్గుడు చంద్రబాబు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుంగనూరులో గడప గడపకూ వైయస్‌ఆర్‌ సీపీ కార్యక్రమం
చిత్తూరు: రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకోవడం తప్ప చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజానికానికి ఒరిగిందేమీ లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. పుంగనూరు మండలం ఎత్తురు, బండ్లపల్లి, నెక్కుంది గ్రామాల్లో పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల గురించి వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు సంపూర్ణంగా అమలు చేయలేదన్నారు. రైతు రుణమాఫీ అని అబద్ధపు హామీ ఇచ్చి అన్నదాతలను మోసం చేశాడన్నారు. పెద్దన్నగా ఉంటానని చెప్పిన చంద్రబాబు డ్వాక్రా అక్కచెల్లెమ్మల కంట కన్నీరు పెట్టించాడని మండిపడ్డారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేపడుతూ నిరుపేద కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు దుర్మార్గపు పాలన పోవాలంటే ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే ప్రజల కష్టాలన్నీ తీరుతాయన్నారు. 
 
Back to Top