వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర చారిత్రాత్మకం

24న రాష్ట్ర్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీ సంఘీభావ యాత్రలు
వైయస్‌ఆర్‌సీపీ నేత పార్థసారధి
విజయవాడః వైయస్‌ జగన్‌ చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర 3వేల కిలోమీటర్లకు చేరుకోనున్న సందర్భంగా  ఈ నెల 24న పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంఘీభావ యాత్రలు నిర్వహిస్తారని వైయస్‌ఆర్‌సీపీ నేత పార్థసారధి తెలిపారు. ప్రజా సంకల్పయాత్ర చారిత్రాత్మకమైందన్నారు. మూడువేల కిలోమీటర్లు జగన్‌ పాదయాత్ర దిగ్విజయంగా సాగుతుందని, వివిధ వర్గాల సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి భరోసా నిస్తూ సాగుతుందన్నారు.  5 సంవత్సరాల చిన్నారుల నుంచి 90 సంవత్సరాల వృద్ధులు వరుకు వైయస్‌ జగన్‌ను నేరుగా కలిసి సమస్యలు చెప్పుకోవడంతో  జగన్‌పై ప్రజలకు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుందన్నారు. పాదయాత్రలో వైయస్‌ జగన్‌ దృష్టికి వచ్చిన అన్ని సమస్యలకు ఆయన పరిష్కారం చూపిస్తారని ప్రజలు భావిస్తున్నారన్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top