ఎన్నికలకు సిద్ధమా బాబూ?


విజయవాడ: అబద్ధాలు, మోసాలతో చంద్రబాబు పాలన సాగుతుందని, చంద్రబాబుకు దమ్ముంటే 1500 రోజుల విజయాలపై ఎన్నికలకు సిద్ధమా అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి సవాల్‌ విసిరారు. ఆంధ్రప్రదేశ్‌ అన్నది అన్నపూర్ణ రాష్ట్రమని, గతంలో ఈ రాష్ట్రం నష్టపోవడానికి చంద్రబాబు కూడా ఓ ప్రధాన కారణమన్నారు. ఇప్పటి వరకు ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండు చేశారు. కేవలం రూ.25 వేల కోట్లు మాత్రమే ఏపీకి పెట్టుబడులు వచ్చాయన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియజేసి, మీ ప్రభుత్వం సాధించిందేంటో వివరించాలని డిమాండు చేశారు.
 
Back to Top