పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు

గుంటూరు : పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుంద‌ని  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్ర‌తినిధి పార్థసారథి అన్నారు.  బుధవారం గంటూరులో జరిగిన బూత్‌ కన్వీనర్ల శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడుతూ.. అన్నీ కమిటీల కంటే బూత్ కమిటీలదే ప్రాధాన్యత ఎక్కువని చెప్పారు. బూత్ స్థాయిలో సమస్యలను కనుగొని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో దోచుకున్న డబ్బుతోనే తెలుగుదేశం పార్టీ గెలవాలని చూస్తోందన్నారు. కొన్ని పత్రికల చేత కావాలనే వైయ‌స్ఆర్‌సీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు ఎప్పుడో మర్చిపోయారని పేర్కొన్నారు. ఆడ పిల్లలపై అత్యాచారాలు జరుగుతుంటే అరికట్టలేని పరిస్థితిలో ప్రభుత్వ ఉందని, చంద్రబాబుకి యంత్రాంగంపై పట్టు లేదని విమ‌ర్శించారు. వైయ‌స్ జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేసుకుందామ‌ని, రాజ‌న్న రాజ్యాన్ని మ‌ళ్లీ తెచ్చుకుందామ‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.  

Back to Top