ఎన్నికల్లో విజయానికి బూత్‌ కమిటీలదే ప్రధాన పాత్ర

వైయస్‌ఆర్‌ జిల్లా: ఎన్నికల్లో విజయానికి బూత్‌ కమిటీ కన్వీనర్లే పాత్ర ప్రధానమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల బూత్‌ కమిటీ శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూత్‌ కమిటీ సభ్యులకు పలు అంశాలపై శిక్షణను ఇచ్చారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలను, అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యం చేయాలని సూచించారు. పార్టీని బూత్‌ లెవల్‌లో మరింత పటిష్టం చేసేందుకు కృషి చేయాలన్నారు. 
Back to Top