రెండు పంటలకు నీరిచ్చిన ఘనత వైయస్‌ఆర్‌దే


పెడన: నియోజకవర్గంలో రెండు పంటలకు నీరిచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డిదే అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్ధసారధి అన్నారు. పెడనలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.. చంద్రబాబు చేతకానితనం కారణంగా రైతులు పొట్ట చేతపట్టుకొని వలస వెళ్లారని విమర్శించారు. తొమ్మిదేళ్లలో ఒక పంటకు నీరు ఇవ్వలేని చంద్రబాబు ప్రభుత్వం..ఈ నాలుగేళ్లలో కూడా అదే తీరు కొనసాగిస్తున్నారన్నారు. పారిశ్రామికవేత్తలకు ఏవిధంగా కట్టబెడుదామన్నదే టీడీపీ నేతల విధానమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌రాజశేఖరరెడ్డి హయాంలో రెండు పంటలకు నీరు ఇచ్చారన్నారు. ఇవాళ రైతులు పండించిన పంటను అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారన్నారు. పంటలు అమ్ముకోవాలంటే పాసుబుక్కులు, ఈ– పాస్‌అంటూ దద్దమ్మ ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. నాడు వైయస్‌ఆర్‌ హయాంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేవన్నారు. నాడు అర్హత ఆధారంగా పింఛన్లు, రేషన్‌కార్డులు అందించారన్నారు. 
 
Back to Top