బాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా భయపడం

– ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొంటున్న వారి ఫోటోలు తీస్తున్న పోలీసులు
 – ప్రభుత్వ సూచనల మేరకే పోలీసుల ఓవరాక్షన్‌
కృష్ణా జిల్లా: ప్రజా సంకల్ప యాత్రను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని, పాదయాత్రలో పాల్గొంటున్న వారిని భయాందోళనకు గురి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్ధసారధి పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాబు ప్రభుత్వం ప్రజలను భయపెడుతోందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత పార్థసారధి విమర్శించారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రకు వస్తున్న వారి ఫోటోలను మఫ్టీలో ఉన్న పోలీసులు తీసి భయందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ సూచనల మేరకే పోలీసులు ప్రజలను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రను బలహీనపరచాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా భయపడే ప్రసక్తి లేదని పార్థసారధి హెచ్చరించారు. వైయస్‌ జగన్‌కు ప్రజల మద్దతు ఉందని స్పష్టం చేశారు. ఎవరైతే తమ సమస్యలు చెప్పుకునేందుకు  వైయస్‌ జగన్‌కు వస్తున్నారో వారి ఫోటోలు పోలీసులు తీసి భయందోళనకు గురి చేస్తున్నారని తెలిపారు. వైయస్‌ జగన్‌ను కలిసిన వారికి ఇల్లు ఇవ్వమని, పింఛన్లు కట్‌చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజా సంకల్ప యాత్రను అడ్డుకోలేరని ఆయన వెల్లడించారు.
 

తాజా ఫోటోలు

Back to Top