బాబుది కార్పొరేట్‌ కల్చర్‌


– వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి
– ఉద్యోగులపై ఎందుకంత చులకన భావం
– హక్కుల కోసం ఉద్యమిస్తే లాఠిచార్జ్‌ చేస్తారా
– ఉద్యోగుల పోరాటానికి పూర్తిగా మద్దతు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని, ఉద్యోగులపై లాఠీచార్జ్‌ అమానుషమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖండించింది.  మొట్టమొదటి నుంచి చంద్రబాబు మనస్తత్వం ఉద్యోగులకు వ్యతిరేకం, వ్యాపారులకు అనుకూలమని, ఆయనది కార్పొరేట్‌ కల్చర్‌ అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి విమర్శించారు. బుధవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పార్థసారధి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రాసుకున్న మనసులో మాట పుస్తకంలో కూడా ఇదే ఉందని గుర్తు చేశారు. గత తొమ్మిదేళ్ల పాలనలో కూడా చంద్రబాబు ఉద్యోగులను వేధించారని, వారు ఈ రాష్ట్రానికి శాపం అన్న విధంగా వ్యవహరించారని గుర్తు చేశారు. ఉద్యోగ వ్యతిరేక విధానాలు అనుసరించారని, ఖాళీ ఉద్యోగాలను ¿¶ ర్తీ చేయలేదన్నారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ అంటూ  కొత్త కొత్త విధానాలు అమలు చేశారన్నారు. ఓట్ల కోసం చంద్రబాబు రకరకాల కుట్రలు చేస్తుంటారని, అందులో ఇది ఒక తార్కణం అన్నారు.  ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. ఉద్యోగులంటే ప్రభుత్వానికి ఎందుకంత చులకన అని పార్థసారధి ప్రశ్నించారు. ∙కాంట్రూబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ వద్దు అన్నప్పుడు ప్రభుత్వం తప్పించుకుంటే, ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌ ఉద్యోగులకు మద్దతుగా నిలిచారన్నారు. ఉద్యోగుల ఆందోళనకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతుగా ఉంటుందని, వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే వారి డిమాండ్లు నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఆత్మసై్థర్యం కోల్పోయిందని మండిపడ్డారు.  ఈ ప్రభుత్వ చర్యలను వైయస్‌ఆర్‌సీపీ ఖండిస్తుందని చెప్పారు.

ప్రజాస్వామ్య ప్రభుత్వమా?కాదా..
ఆ పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని రాజ్యాంగ బద్ధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని అణగద్రోక్కడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంభించిన ప్రభుత్వాలు మనుగడ సాగించింది లేదన్నారు. ఏపీలో కేవలం ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వమే కాదని, రాష్ట్ర ప్రజల వ్యతిరేక ప్రభుత్వమని పార్థసారది విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు తమ కోర్కేలు కోరే హక్కు ఉందా? లేదా అని ప్రశ్నించారు. పెన్షన్‌ పొందడం అన్నది ప్రతి ఒక్క ఉద్యోగి హక్కు అన్నారు. ఉద్యోగులు జీతాలు పెంచమని పోరాటం చేయడం లేదని, ప్రస్తుతం ఉన్న విధానం వల్ల నష్టపోతున్నామని ఆందోళన చేపట్టినట్లు చెప్పారు. ఇంతకు ముందు ఉన్న విధానాన్ని కొనసాగించాలని ఉద్యోగులు డిమాండు చేస్తుంటే కనీసం వారితో చర్చించేందుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతుందోనని నిలదీశారు. లక్షలాది మంది ఉద్యోగులు ప్రభుత్వంపై పోరాటం చేస్తుంటే ఈ ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందో ఆలోచన చేయాలని సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో తమ ప్రభుత్వానికి ఇంత మంచి పేరు రావడానికి ప్రభుత్వ ఉద్యోగులే కారణమని చెప్పినట్లు గుర్తు చేశారు. హక్కుల సాధన కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులపై పోలీసులతో లాఠీచార్జ్‌ చేయించిన ఈ ప్రభుత్వాన్ని ఏమనాలని ఆయన ధ్వజమెత్తారు. విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద కొన్ని రోజులుగా ఉద్యోగులు ధర్నా చేస్తుంటే వాళ్లతో చర్చించి సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం వేలాది మంది పోలీసులతో అసెంబ్లీ వద్ద అడ్డుకోవడం ఎందుకని ప్రశ్నించారు. శాసన మండలిలో ప్రత్యేకంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రశ్నించే ఎమ్మెల్సీలకు చర్చించే అవకాశం ఇవ్వకపోవడం ఎంతవరకు న్యాయమన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపకపోతే ఉద్యమిస్తామని, వారికి వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని పార్థసారధి తెలిపారు.
 
Back to Top