ఎల్లో మీడియా తప్పుడు ప్రచారంపై న్యాయ పోరాటం

విజయవాడ: ఎల్లో మీడియా వైయస్‌ఆర్‌సీపీపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్ధసారధి మండిపడ్డారు. నిన్న వైయస్‌ జగన్‌తో పార్టీ సీనియర్‌ నేతలు, ఎంపీలు సమావేశం నిర్వహించారని, ఈ సమయంలో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారని ఎల్లో మీడియా ప్రచారం చేసిందన్నారు. ఈ వార్తలను వైయస్‌ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై లీగల్‌గా ప్రోసీడ్‌అయి న్యాయ పోరాటం చేస్తామని పార్ధసారధి తెలిపారు. 
 
Back to Top