నాలుగేళ్లుగా ప్రజల హక్కులు గుర్తుకు రాలేదా బాబూ?


– నాలుగేళ్లుగా కేంద్రాన్ని ప్రశ్నించని చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో ఏవేవో వ్యాఖ్యలు
– రాష్ట్ర ప్రజలు నష్టపోవడానికి చంద్రబాబే కారణం
– బాబు బేలతనం, కుళ్లు రాజకీయాలు ప్రజలకు అర్థమవుతున్నాయి
– హోదాను వదులుకొని..ప్యాకేజీని ఎందుకు ఒప్పుకున్నారు
– ఢిల్లీ వెళ్లిన 29 సార్లు కేంద్రంతో జరిపిన చర్చలేమిటి?
– ప్రత్యేక హోదా సాధించడమే వైయస్‌ఆర్‌సీపీ లక్ష్యం
విజయవాడ: నాలుగేళ్లు బీజేపీతో కలిసిన నడిచిన చంద్రబాబుకు ప్రజల హక్కులు గుర్తుకు రాలేదా అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి ప్రశ్నించారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయని చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ చంద్రబాబు ఢిల్లీలో చంద్రబాబు జాతీయ మీడియాతో మాట్లాడిన తీరును పార్థసారధి తప్పుపట్టారు. ఈ మేరకు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన మూలంగా, చేతకాని తనం కారణంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎలా సరిదిద్దాలో ఆలోచించకుండా తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ఎదుటివారిపై బుదర జల్లే ప్రయత్నం చేశారన్నారు. 

ఇవాళ ఢిల్లీకి వెళ్లి తానే వీరుడిని, రాష్ట్ర ప్రయోజనాల కోసం తానొక్కడినే పోరాటం చేస్తున్నట్లు గొప్పులు చెప్పారన్నారు. ఢిల్లీ, అమరావతి, సచివాలయం, అసెంబ్లీలో ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడిన మాటలను ఒక్కసారి వీడియో క్లిప్పింగ్‌లు చూపితే ఢిల్లీ మీడియా అవాక్కు అవుతుందన్నారు. ఈ రోజు ఢిల్లీలో మాట్లాడిన మాటలు, గతంలో మీరు చేసిన కామెంట్లు చూస్తే విస్తుపోతారన్నారు. ఏపీకి ఇంతనష్టం జరగడానికి మీరు కాదా అసలు కారణం అని ^è ంద్రబాబును నిలదీశారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి ప్రయానం చేసి ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయని మీ పాపాలను కడుకున్నే ప్రయత్నం చేస్తున్నది వాస్తవం కాదా అన్నారు. కేంద్రం ఇవ్వడం లేదని, తక్కువ ఇచ్చారని తప్పుడు లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. ఈ మూడేళ్లలో ఏ రోజైనా సరే కేంద్రాన్ని నిలదీశారా అని ప్రశ్నించారు. ప్రతి సారి కేంద్ర ప్రభుత్వం బ్రహ్మండంగా చేస్తుందని, దేశంలో ఏ రాష్ట్రంలో సాధించని ప్రగతి నేను చేశానని గొప్పలు చెప్పింది వాస్తవం కాదా అన్నారు. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ మొదటి నుంచి చెప్పిందన్నారు. అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని సూటిగా ప్రశ్నించారు.  ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదాకు విధి విధానాలు తయారు అవుతున్నాయని చెప్పారని, ఆ తరువాత ప్రత్యేక ప్యాకేజీ అన్నారన్నారు. ఆ తరువాత ప్రత్యేక అసిస్టెంట్‌ అన్నారని, ఇప్పుడు ప్రత్యేక హోదా అంటున్నారన్నారు. ఏది వాస్తవమో చంద్రబాబే చెప్పాలన్నారు. 

రాష్ట్రానికి అన్యాయం చేసేందుకే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారన్నారు. అర్ధరాత్రి పూట విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చిన ప్యాకేజీని ఒప్పుకోవడానికి చంద్రబాబుకు, అరుణ్‌జైట్లీకి మధ్య జరిగిన ఒప్పందం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర కేబినెట్‌తోగానీ,అధికారులతో కానీ చర్చించకుండా ఏవి«ధంగా ప్యాకేజీని ఆ నాడు ఒప్పుకున్నారన్నారు. మీ అవినీతి కార్యక్రమాలు, మీ చీకటి ఒప్పందాలను బయటపెడతారనే కదా ఇ న్నాళ్లు కేంద్రాన్ని నిలదీయలేదన్నారు. ప్రత్యేక హోదాను వదులుకొని ప్యాకేజీని ఎందుకు ఒప్పుకున్నారో స్పష్టం చేయాలన్నారు. 11 ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు పదేళ్లు కాలపరిమితి పొడిగిస్తే మీరు ఏం చేశారని నిలదీశారు. 29 సార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో ఎలాంటి చర్చలు జరిపారో ఆ లేఖలన్నీ బయట పెట్టాలని డిమాండు చేశారు. కేంద్రానికి ఇచ్చిన లేఖల్లో ప్రత్యేక హోదా గురించి ఒక్క పేరా అయినా రాశారా అని మండిపడ్డారు. నలబై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న మీరు 14వ ఆర్థిక సంఘానికి ఉన్న అధికారాలు ఏంటో తెలియదా అన్నారు. మీ చేతకాని తనం మూలంగా రాష్ట్రానికి అన్యాయం చేసి  ఇవాళ నాటకాలు ఆడుతారా అని ద్వజమెత్తారు. 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందన్నారు. వైయస్‌ఆర్‌సీపీ బీజేపీపై పోరాటం చేస్తుందని తెలిసీ కూడా ఎందుకు ఎన్‌డీఏలో కొనసాగారని ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌సీపీ అవిశ్వాస తీర్మానం పెడతామంటే వెంటనే యూటర్న్‌ తీసుకుని డ్రామాలాడాన్నారు.  ఇప్పటికైనా వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలతో కలిసి రాజీనామాలు చేయాలన్నారు. నిసిగ్గుగా వైయస్‌ఆర్‌సీపీ తరఫున గెలించిన ఎంపీ బుట్టా రేణుకాను మీ పక్కన కూర్చోబెట్టుకొని మీడియాతో మాట్లాడటం దారుణమన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను చంద్రబాబు బ్రష్టుపట్టించారని మండిపడ్డారు. నీ అవినీతి మూలంగా, రాజ్యాంగ వ్యతిరేక కార్యాకలాపాలతో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బాటలో ఉద్యమించాలని చంద్రబాబుకు పార్థసారధి సూచించారు. 
 
Back to Top