అగ్రిగోల్డు బాధితుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం


విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం అగ్రిగోల్డు బాధితుల జీవితాలతో చెలగాటమాడుతుందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్ధసారధి విమర్శించారు. శనివారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లుగా అగ్రిగోల్డు బాధితుల సమస్యలను ఈ ప్రభుత్వం పరిష్కరించడం లేదని, న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదని విమర్శించారు. బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నా..ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అగ్రి గోల్డు బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వైయస్‌ఆర్‌సీపీ నేతలు హామీ ఇ చ్చారు.
 
Back to Top