పోలీసుల అండతో పల్లె రఘునాథ్‌రెడ్డి దౌర్జన్యం

అనంతపురం:  పోలీసుల అండతో రఘునాథ్‌రెడ్డి దౌర్జన్యానికి పాల్పడటం బాధాకరమన్నారు. పల్లె రఘునాథ్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని నదీం అహ్మద్‌ డిమాండు చేశారు.  వైయస్‌ఆర్‌సీపీ నేత నదీం అహ్మద్‌ భూముల్లో చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథ్‌రెడ్డి వర్గీయులు దౌర్జన్యం చేస్తున్నారు. ఆలమూరు వద్ద 206 ఎకరాలు పల్లె రఘునాథ్‌రెడ్డి కొనుగోలు చేశారు. ఈ భూమిపై కోర్టులో వివాదం ఉండగానే పల్లె రఘునాథ్‌రెడ్డి కొనుగోలు చేశారు. పోలీసుల అండతో పల్లె రఘునాథ్‌రెడ్డి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై వైయస్‌ఆర్‌సీపీ నేత నదీం అహ్మద్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన తల్లికి చెందిన భూమిని అక్రమంగా పల్లె రఘునాథ్‌రెడ్డి కొనుగోలు చేశారని మండిపడ్డారు. కోర్టులో కేసు ఉండగా రిజిష్టే్రషన్‌ చేయించుకోవడం తప్పు కాదా అని ప్రశ్నించారు.
 
Back to Top