టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యం

తూర్పుగోదావరి: చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ప్రముఖ డాక్టర్‌ మురళీకృష్ణ అన్నారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మురళీకృష్ణ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని చంద్రబాబు సర్కార్‌ అభివృద్ధి చేయకుండా స్వార్థ రాజకీయాలు చేస్తున్నారనే భావనలో ప్రజలంతా ఉన్నారన్నారు. ఎన్నికల సమయంలో 600లకు పైగా వాగ్ధానాలు ఇచ్చి వాటిల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు చంద్రబాబు సర్కార్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే అవినీతి అంతం కావాలని, అది వైయస్‌ జగన్‌ ఒక్కరితోనే సాధ్యమన్నారు. తాను అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన ఉంటుందో ఇప్పటికే వైయస్‌ జగన్‌ నవరత్నాల పేరిట ప్రజలకు వివరించడం జరిఇందన్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాకు వెళ్లినా ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. ఇప్పటి వరకు మోసపోయిన ప్రజలంతా వైయస్‌ జగన్‌తో కలిసి అడుగులో అడుగు వేస్తున్నారన్నారు. 
Back to Top