జగనన్నకు అండగా ఉందాం


పశ్చిమ గోదావరి: వైయస్‌ జగన్‌కు తోడుగా ఉందామని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు ముదునూరు ప్రసాదరావు పిలుపునిచ్చారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం ఆకివీడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..దేశ చరిత్రలో ప్రజల కోసం, ప్రజల ఇబ్బందుల కోసం ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత ఒక్క వైయస్‌ఆర్‌ కుటుంబానికి మాత్రమే దక్కుతుందన్నారు. ప్రజలకు భరోసాగా, అండగా ఉండేందుకు ఆ నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయిందన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైయస్‌ఆర్‌ సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. వైయస్‌ షర్మిళ మరో ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసి మనందరికి ధైర్యాన్ని నింపారన్నారు. ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే చంద్రబాబు మోసం చేశారన్నారు. ప్రజల ఇబ్బందులను తెలుసుకునేందుకు నేనున్నానని వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి ఎండ, వానలను లెక్క చేయకుండా మన వద్దకు వచ్చారన్నారు. టీడీపీని నమ్మి మళ్లీ మోసపోకుండా వైయస్‌ జగన్‌కు ఓట్లు వేసి ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు.
 
Back to Top