ఫిరాయింపుల‌పై అన‌ర్హ‌త వేటు వేయండి..మ‌ర్నాడే స‌భ‌కు వ‌స్తాం


విశాఖ జిల్లాః    వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి టీడీపీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేస్తే మా ఎమ్మెల్యేలు మ‌ర్నాడే అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌ర‌వుతార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ఎందుకు హాజరుకావడం లేదో బహిరంగ లేఖ రాశామన్నారు.  వైయస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పందన లభిస్తుందని విజయసాయి రెడ్డి అన్నారు. ప్రతిపక్షాన్ని అంతుచూస్తామన్న చంద్రబాబు వ్యాఖ్యల్ని ఆయ‌న ఖండించారు. టీడీపీకి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చ‌రించారు. సోషల్‌ మీడియాలో వైయస్‌ఆర్‌సీపీ ఆధిపత్యం సాధించింద‌న్నారు.  బాబుపాలనను ఎండగడుతూ సోషల్‌మీడియా విమర్శించిందన్నారు..సోషల్‌ మీడియాను టార్గెట్‌ చేస్తూ జరుగుతున్న అరెస్ట్‌లు దారుణ‌మ‌న్నారు.  ఏ పార్టీ ఏపీకి అన్యాయం చేసిందో అటువంటి కాంగ్రెస్‌తో టీడీపీ జత కట్టిందని ధ్వ‌జ‌మెత్తారు. ఆ రెండు పార్టీల‌కు త్వరలో ప్రజలు బుద్ధిచెబుతారన్నారు. సోషల్‌ మీడియాలో కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా పేర్కొందని గుర్తుచేశారు. 23 మంది పార్టీ ఫిరాయింపులకు పాల్పడి ముగ్గురిని మంత్రులుగా చేసిన ఎమ్మెల్యేలను డిస్‌క్వాలిఫై చేయాలని ఆయ‌న డిమాండు చేశారు.
Back to Top