వైయస్‌ఆర్‌ పేరు చెప్పగానే కళ్లలో నీళ్లు వచ్చాయి అమెరికా: దివంగత ముఖ్యమంత్రి గొప్పతనం ప్రపంచమంతా చూసిందని మాజీ ఎంపీ, వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. మహానేత మరణించి తొమ్మిదేళ్లు అవుతున్నా..ఆయన వీడియో చూస్తే ఇప్పటికీ కళ్లలో నీళ్లు వస్తాయని భావోద్వేగానికి గురయ్యారు. వైయస్‌ఆర్‌ లేని లోటు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తమ నియోజకవర్గంలో ఓ వ్యక్తి అనారోగ్యానికి గురైతే..ఆపరేషన్‌ చేయించేందుకు రూ.6 లక్షలు అవసరమయ్యాయి. ఆ డబ్బు కట్టలేక ఆసుపత్రి నుంచి వెనక్కి తీసుకొచ్చే సమయంలో ఆ వ్యక్తి భార్య తనతో మాట్లాడుతూ..వైయస్‌ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పినప్పుడు తనకు కళ్లలో నీళ్లు వచ్చాయన్నారు. ఇలా ఎంతో మంది పేద ప్రజలు ఈ ప్రభుత్వ పాలనలో  ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. వైయస్‌ఆర్‌ పాలనలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతో మందికి పునర్‌జన్మనిచ్చారన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్‌ రాజశేఖరరెడ్డి కన్న మంచి పరిపాలన అందిస్తారని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. వాళ్ల నాన్న కన్న మంచి పేరు తెచ్చుకుంటారన్నారు.
 
Back to Top