రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం

న్యూఢిల్లీ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని రాజీనామా ఆమోదించుకున్న ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. బుధవారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్‌ జగన్‌ మొట్ట మొదటి నుంచి చెబుతున్నట్లు ప్రత్యేక హోదా కోసం మేం రాజీనామా చేసి ఆమోదించుకున్నామన్నారు. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టింది కూడా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనే అన్నారు. ఏ రోజు కూడా యూటర్న్‌ తీసుకునే పరిస్థితి లేదన్నారు. హోదా కోసం చివరి వరకు పోరాటం చేస్తామన్నారు.
 
Back to Top