టీడీపీ పాలనలో దళితులకు చేసింది ఏమీ లేదువిజయవాడ: రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఒక్కశాతం కూడా మెరుగుపడలేదని, టీడీపీ పాలనలో దళితులకు చేసింది ఏమీ లేదని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున విమర్శించారు. రాజ్యాంగం చంద్రబాబు పాలనలో అపహాస్యం అవుతుందన్నారు. దళితులపై దాడులు చేస్తున్నారన్నారు. అంబేద్కర్‌ రాజ్యాంగం ప్రకారం టీడీపీ పాలన జరగడం లేదన్నారు. రూ.40 వేల కోట్లు వెచ్చించి దళితులకు ఏవేవో చేశామని ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటు అన్నారు. బడ్జెట్‌లో దళితులకు ఎంత కేటాయించావో అందరికి తెలుసు అన్నారు. జనాభా ప్రతిపాదికన రావాల్సిన డబ్బులు ఎంత ఖర్చు చేశావని ప్రశ్నించారు. 
 
Back to Top