ఉద్యోగులపై చంద్రబాబు తీరు అప్రజాస్వామికం..

విజయవాడః సీపీఎస్‌ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ సెంట్రల్‌ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు తీవ్రంగా ఖండించారు.. సీపీఎస్‌ రద్దు తమ పరిధిలో లేదని ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు.శాంతియుతంగా ర్యాలీ చేపట్టిన ఉపాధ్యాయులపై చంద్రబాబు సర్కార్‌ ఉక్కుపాదం మోపుతుందన్నారు. ఉపాధ్యాయులను ఈడ్చిపారేయడం సమంజసం కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంతృత్వంలో ఉన్నామా అని ప్రశ్నించారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని ఇప్పటికే వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను ఎలా పరిష్కరించాలో ఆలోచన చేయకుండా పోలీసులతో బలవంతంగా అణచివేయడం దారుణమన్నారు.ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ప్రతివర్గాన్ని తమ సమస్యల వినిపించకుండా గొంతునొక్కే ప్రయత్నాలు చేస్తుందన్నారు.ముస్లింలను,నాయీ బ్రాహ్మణులపై, రైతులపై కూడా ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించిందన్నారు.
Back to Top