ఇళ్ల రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించాలి


విజయవాడ: విజయవాడ నగరంలో నిలిపివేసిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించాలని వైయస్‌ఆర్‌సీపీ విజయవాడ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లాది విష్ణు డిమాండు చేశారు. గురువారం విష్ణు ఆధ్వర్యంలో సింగ్‌నగర్‌లో ధర్నా నిర్వహించారు. సింగ్‌రోడ్డు, పాయకాపురం ప్రాంతంలో నిలిపివేసిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించాలని మల్లాది విష్ణు డిమాండు చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. 
 
Back to Top