టీడీపీకి ప్రజాగ్రహం తప్పదు


విజయవాడ: ప్రజల ఆగ్రహానికి టీడీపీ గురికాక తప్పదని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి మల్లాది విష్ణు హెచ్చరించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా అధికార పార్టీ ప్రచారం చేయడం సరికాదన్నారు. ఏపీ ప్రజల ఆకాంక్షను కేంద్రానికి చాటి చెబుతామని పేర్కొన్నారు.  లోక్‌సభ సమావేశాల చివరి రోజున వైయస్‌ఆర్‌సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామా చేశారన్నారు. ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ఎంపీలు రాజీనామా చేశారన్నారు. వైయస్‌ఆర్‌సీపీకి ఎక్కడ ప్రజల్లో ఆదరణ వస్తుందో అని టీడీపీ ఈ రాజీనామాలను డ్రామాలుగా దుష్ప్రచారం చేశారన్నారు. ఏడాదిలో ఎన్నికలు రావని పేర్కొనడం ఎక్కడ లేదన్నారు.  ప్రత్యేక హోదా కోసం బీజేపీపై ఒత్తిడి చేసే కార్యక్రమం మేం చేస్తుంటే చంద్రబాబు చులకనగా మాట్లాడారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఉప ఎన్నికకు రావాలని సవాల్‌ విసిరారు. నలుగురు మంత్రులను కూడా భర్తరఫ్‌ చేయాలని డిమాండు చేశారు. రాజీనామాలకు వైయస్‌ఆర్‌సీపీ కట్టుబడి ఉందన్నారు. ఏపీ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తామని వైయస్‌ జగన్‌ మొదటి నుంచి చెబుతున్నారన్నారు. ఎన్నికలంటే టీడీపీకి భయమన్నారు. ప్రత్యేక హోదాను ప్యాకేజీ కింద మార్చి లబ్ధి పొందిన చంద్రబాబు ఈ రోజు డ్రామాలాడుతున్నారని విమర్శించారు.
 
Back to Top