చిత్తశుద్ధి ఉంటే మద్దతు తెలపండి

 2న విజయవాడ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైలు
భారీగా తరలివెళ్లనున్న పార్టీ నేతలు, కార్యకర్తలు
5న పార్లమెంట్‌ ఆవరణలో వైయస్‌ఆర్‌ సీపీ ధర్నా
 విజయవాడ: టీడీపీ సర్కార్‌ తనకు అవసరమైనప్పుడల్లా ప్రతిపక్షాన్ని అడ్డుకునేందుకు పోలీసులను ఉపయోగిస్తుందని వైయస్‌ఆర్‌ సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు గందరగోళంలో ఉన్నారన్నారు. హోదాపై టీడీపీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాజీనామాలకు, అవిశ్వాసానికి మద్దతు తెలపాలన్నారు. లుగేళ్లుగా హోదాను అడ్డుకుంటూ ప్రజాగ్రహం చూసిన తరువాత మాట తప్పి హోదా కావాలని చాటుగా మాట్లాడుతున్నారన్నారు.  హోదా వల్ల కలిగే లాభాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ హోదా అవశ్యతను ప్రజలకు క్షుణ్ణంగా వివరించారన్నారు. 2వ తేదీ శుక్రవారం విజయవాడ నుంచి ప్రత్యేక రైలు ఢిల్లీకి బయల్దేరుతుందని చెప్పారు. 2 నుంచి 3 వేల మంది వైయస్‌ఆర్‌ సీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక రైల్లో ఢిల్లీ వెళ్లి పార్లమెంట్‌ ఆవరణలో 5న ధర్నా చేపట్టనున్నారన్నారు.  

 
Back to Top