లోకేష్‌ ఆస్తుల ప్రకటన బూటకం, నాటకం– 22 మంది ఎమ్మెల్యేలను పెట్టుబడి పెట్టి కొనింది మీ డబ్బుతో కాదా? 
– లోకేష్‌ ఆస్తుల్లో వాటిని ఎందుకు చూపలేదు
– ఏపీలో డిసెంబర్‌ 8ని అబద్ధాల దినోత్సవంగా జరుపుకోవాలి
– పోలవరానికి ఆది పురుషుడు వైయస్‌ఆర్‌


విజయవాడ: మంత్రి నారా లోకేష్‌ ఆస్తుల ప్రకటన, బూటకం, నాటకమని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. లోకేష్‌ చట్టాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పోలవరానికి దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆదిపురుషుడని, ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం తలోమాట మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. వైయస్‌ జగన్‌పై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆరోపణలను మల్లాది విష్ణు తీవ్రంగా ఖండించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి. అర్హత లోకేష్‌కు లేదన్నారు. న్యాయపరమైన  అంశాలపై ఆస్తుల ప్రకటన చేయాలని వైయస్‌ జగన్‌ను కోరడం ఆయన అజ్ఞనానికి నిదర్శమన్నారు. 

ఆ డబ్బు మీది కాదా?
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతిపక్షానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను రూ.720 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేశారని మల్లాది విష్ణు అన్నారు. ఆ డబ్బంతా మీది కాదా? అది మీ పెట్టుబడి డబ్బులు కాదా అని లోకేష్‌ను నిలదీశారు. మీ ఆస్తుల ప్రకటనలో ఈ డబ్బును ఎందుకు చూపించలేదన్నారు. లోకేస్‌ ఆస్తుల ప్రకటన అవాస్తవమని, అది బూటకం, నాటమని విమర్శించారు. లోకేష్‌ పూర్తిగా అబద్ధాలు, అసత్యాలు మాట్లాడారని, అందుకే డిసెంబర్‌ 8ని అబద్ధాల దినోత్సవంగా నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆస్తుల ప్రకటన వాస్తవాలకు విరుద్ధంగా చెప్పారన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఇంటిని మీడియాకు దూరంగా పెట్టారని, తమకు ఏమీ లేనట్లుగా చంద్రబాబు నటిస్తూ, కొడుకుతో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని, వైయస్‌ జగన్‌ను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే స్థాయి, అర్హత లోకేష్‌కు లేదన్నారు. చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వ అవినీతిపై వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ఓ పుస్తకం రూపొందించి రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులకు అందజేశామన్నారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే అవినీతి చక్రవర్తి చంద్రబాబు అనే పుస్తకంపై విచారణ చేయించుకోని మీ సచ్చిలతను నిరూపించుకోవాలన్నారు. చేతికి ఉంగారం, వాచ్‌ లేని మీరు ఎందుకు విచారణకు ముందుకు రావడం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిపై గతంలో ఆరోపణలు వస్తే విచారణ చేయించుకున్నారని గుర్తు చేశారు. మీ ప్రకటనలో ఉన్న ఆస్తులకు డబుల్‌గా డబ్బులు ఇస్తామని మా ఎంపీ మిథున్‌రెడ్డి సవాల్‌ విసిరారు. దానికి మీరు ముందుకు వస్తారా అని ప్రశ్నించారు. ఈ ఆస్తుల ప్రకటన బూటకం, నాటకమని స్పష్టంగా అర్థమవుతుందన్నారు.

పోలవరంపై తలోమాట
పోలవరంపై ప్రభుత్వం తలోమాట మాట్లాడుతున్నారని మల్లాది విష్ణు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అన్ని అనుమతులు లె చ్చారని, ఆ ప్రాజెక్టకు ఆది పురుషుడని గుర్తు చేశారు. పోలవరానికి వైయస్‌ఆర్‌సీపీ అడ్డుకుంటుందని లోకేష్‌ పేర్కొనడం హస్యాస్పదమన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి పోలవరం కోసం పాదయాత్ర చేశారని వివరించారు. టీడీపీ పోలవరం విషయంలో అనేక సార్లు మాట తప్పిందన్నారు. 2017, 2018లోనే పోలవరం పూర్తి చేస్తామని ద్వంద ప్రకటనలు చేశారని, ఇప్పుడేమో మేం కట్టలేం, కేంద్రానికే అప్పగించి దండం పెడతామని బాబు చెప్పడం దారుణంగా ఉందన్నారు.  

పవన్‌..చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదు
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదని మల్లాది విష్ణు నిలదీశారు. పవన్‌ కళ్యాణ్‌ అవసరానికి మించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం జవాబుదారితనంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఫాతిమా కాలేజీ వ్యవహారంపై మూడు నెలలుగా పట్టించుకోకుండా ఈ రోజు పవన్‌ మాట్లాడటం బాధాకరమన్నారు. ఆయన ప్రజలు మూడు రోజులు కాల్షిట్లు ఇచ్చారని, అందుకే ఇలా ఆరోపణలు చేస్తున్నారన్నారు. పవన్‌ రూపాయికి ఒకపక్కనే చూస్తున్నారు తప్ప, రెండో పక్క ఎందుకు చూడటం లేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. వైయస్‌ఆర్‌సీపీకి చెందిన ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసి వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి వారితో వైయస్‌ జగన్‌ను తిట్టిస్తున్నారని, ఈ విషయంపై పవన్‌ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. 


 

తాజా ఫోటోలు

Back to Top