సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రాజీనామా చేయాలివిజయవాడ:  ముగ్గురు రైతుల ఆత్మహత్యాయత్నానికి కారకులైన వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి రాజీనామా చేయాలని వైయస్‌ఆర్‌సీపీ నేత మల్లాది విష్ణు డిమాండ్‌ చేశారు. నకిలీ విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులు ఆత్మహత్య యత్నకు పాల్పడటంతో ఆయన బాధిత రైతులను పరామర్శించారు. జంబులయ్య, తిరుపతయ్య, పూర్ణయ్య ఇవాళ పురుగు మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారిని పరామర్శించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా జాయింట్‌ కలెక్టర్‌ను పంపించడం సరికాదన్నారు. కనీసం ఈ రాష్ట్రంలో మొబలైజేషన్‌ అడ్వాన్స్‌ పేరుతో దోచి పెడుతున్నారని, రైతులను మాత్రం ప్రభుత్వం చులకనగా చూస్తుందని మండిపడ్డారు.  రైతుల పక్షాన వైయస్‌ఆర్‌సీపీ ఉంటుందని స్పష్టం చేశారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. గంటసాల మండలంలో ఎన్‌టీఆర్‌ పేరుతో వరి వంగడాలు అని నకిలీ విత్తనాలు తీసుకొస్తే..వాటితో సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వారిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
 
Back to Top