పవన్‌పై క్విడ్‌ ప్రోకో కేసు పెట్టాలి


 విజ‌య‌వాడ‌ :నాలుగేళ్లు చంద్ర‌బాబు ప్ర‌భుత్వంతో అంట‌కాగిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై క్విడ్‌ ప్రోకో కేసు పెట్టాల‌ని వైయ‌స్ఆర్‌ సీపీ నేత మహ్మద్‌ ఇక్బాల్ డిమాండు చేశారు. వైయ‌స్‌ జగన్‌పై పెట్టిన అక్రమ కేసులపై పవన్‌కు అవగహన లేద‌ని పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్ల్‌పై పవన్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌లోని పార్టీ కార్యాల‌యంలో మ‌హ్మ‌ద్ ఇక్బాల్ మీడియాతో మాట్లాడారు. హజ్‌ యాత్రికుల పట్ల సీఎం చంద్రబాబు నాయుడు వైఖరి అవమానకరంగా ఉందని విమర్శించారు.  హజ్‌ యాత్రికులను చంద్రబాబు తన వద్దకు పిలిపించుకుని పార్టీ స్లోగన్స్‌ చదవించడం సరికాదని త‌ప్పుప‌ట్టారు.  రాష్ట్ర మంత్రివర్గంలో మైనార్టీలకు చోటివ్వలేదని, ముస్లింల పట్ల చంద్రబాబుకు చులకన భావమని మండిపడ్డారు. ముస్లింలు ఆర్థికంగా ఎదగకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారని  విమ‌ర్శించారు. అక్రమ మైనింగ్‌పై ఎవరు ప్రశ్నించినా కేసులు పెడుతున్నారు. దోషులను ప్రభుత్వం ఎందుకు కాపాడుతోంద‌ని నిల‌దీశారు. 10 రోజుల తరువాత వైయ‌స్ఆర్‌సీపీ నిజనిర్ధారణ కమిటీ మైనింగ్‌ ప్రాంతానికి వెళ్తుందని స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చి పారదర్శకంగా వ్యవహరించాల‌ని సూచించారు.   


Back to Top