నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడే వ్యక్తి వైయస్‌ జగన్‌


ప్రకాశం: నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. చంద్రబాబుకు రాష్ట్ర అభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని పార్లమెంట్‌లో బీజేపీ స్పష్టం చేసిందన్నారు. నాలుగేళ్లుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ప్రత్యేక హోదా విషయంలో చెప్పిన అంశాలనే పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ చెప్పారన్నారు. బీజేపీ, టీడీపీ కలిసి రాష్ట్రాన్ని ముంచాయని, మళ్లీ వారిని నమ్మితే ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి జీవితకాలం వెనుకబడుతుందన్నారు. మాకు పొత్తులతో సంబంధాలు లేవు.. ఎన్నికలకు వెళ్లి మా సత్తా చాటుకొని కేంద్రం మెడలు వంచి హోదా సాధించుకుంటామన్నారు. నాలుగైదు నెలల్లో ఊడిపోయే ఎంపీ పదవులను పట్టుకొని టీడీపీ ఎంపీలు వేలాడుతున్నారన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి చిత్తశుద్ధితో పోరాటం చేయాలని చంద్రబాబుకు సూచించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ రెండు కలిసి పోటీచేస్తాయనేది వాస్తవమన్నారు. 
Back to Top