వైయస్‌ జగన్‌ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు


ప్రకాశం: కాపుల రిజర్వేషన్ల విషయంలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలను కొందరు రాజకీయ లబ్ధి కోసం వక్రీకరిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు మానుగంట మహీధర్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే 6 నెలల లోపే కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ హామీని నెరవేర్చలేదన్నారు. కాపులకు రూ.10 వేల కోట్లను ఇస్తామన్న వైయస్‌ జగన్‌ ప్రకటన హర్షనీయమన్నారు. చంద్రబాబు మాయ మాటలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. 
 
Back to Top