చంద్రబాబు అమెరికా యాత్ర బూటకం

కర్నూలు: అన్నపూర్ణ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చిన వ్యక్తి చంద్రబాబు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మహ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు. చంద్రబాబు అమెరికా యాత్ర బూటకమన్నారు. కర్నూలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఇక్బాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఓటు బ్యాంక్‌ రాజకీయాలతోనే బీజేపీతో చంద్రబాబు విభేదించారన్నారు. రాష్ట్రంలో ముస్లింలను పార్టీల వారిగా విభజించాలని చంద్రబాబు కుట్రపన్నుతున్నారన్నారు. త్వరలోనే టీడీపీ నయవంచన పాలనకు ప్రజలు చరమగీతం పాడతారన్నారు.  
Back to Top