చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు


విశాఖ: ముస్లిం యువకులపై తప్పుడు కేసులు బనాయించి, దారుణంగా కొట్టించిన చంద్రబాబుకు ఒక్కో లాఠీ దెబ్బకు మూల్యం చెల్లించుకోకతప్పదని మైనారిటీ నాయకుడు, రిటైర్డు ఐజీ మహమ్మద్‌ ఇక్బాల్‌ హెచ్చరించారు. విశాఖలోని మైనారిటీల సదస్సులో ఆయన మాట్లాడారు. మూడు దశాబ్ధాల కాలం పోలీసు అధికారిగా పని చేసిన తాను రిటైర్డు అయిన పది రోజులకే వైయస్‌ఆర్‌సీపీలో చేరానన్నారు. టీడీపీ, వైయస్‌ఆర్‌సీపీ రెండే పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయని, చంద్రబాబు నాయకత్వం ప్రజల అవసరాలకు దూరంగా, దోచుకునేందుకే పని చేస్తున్న టీడీపీ ప్రభుత్వమన్నారు. ప్రజల అవసరాల కోసం వైయస్‌ జగన్‌ ముందుకు వస్తున్నారన్నారు. 2009లో చంద్రబాబు తన జీవితంలో బీజేపీతో పొత్తు పెట్టుకోను అని, తనను నమ్మండని చెప్పారన్నారు. తీరా 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకొని, నాలుగేళ్లు వారితో కలిసి పని చేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ యూటర్న్‌ తీసుకున్నారన్నారు. చంద్రబాబు తన రాజకీయ ప్రాధాన్యత కోసం ఇప్పుడు ముస్లింల ఓట్ల కోసం బీజేపీని విమర్శిస్తున్నట్లు నటిస్తున్నారన్నారు. ముస్లింలను అణచివేసే దోరణిలో చూస్తున్నారని, నాలుగేళ్ల తరువాత నారా హమారా అనే కార్యక్రమం పెట్టారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో ముస్లింల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఆయన మీటింగ్‌లో ఎవరైనా ప్రశ్నిస్తే..వైయస్‌ఆర్‌ స్టేజీ మీదకు పిలిచి మాట్లాడించి, వారి సమస్యలు తీర్చారన్నారు. చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీలను ప్రశ్నించిన ముస్లింలను దారుణంగా కొట్టించారని మండిపడ్డారు. నా 30 ఏళ్ల సర్వీసులో ఇలాంటి దారుణం చూడలేదన్నారు. బెయిల్‌ రాకుండా దేశద్రోహం కేసులు నమోదు చేయించారని విమర్శించారు. అగ్రకులాలపై  ఇలాంటి కేసులు ఇంతవరకు ఒక్కటైనా నమోదు చేయించారా అని నిలదీశారు. ఒక్కోక్క లాఠీ §ð బ్బకు చంద్రబాబు మూల్యం చెల్లించుకోవాల్సిందే అని హెచ్చరించారు. ఇన్నాళ్లు బీజేపీతో కాపురం చేసిన చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని, ఏ ఒ క్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. వైయస్‌ జగన్‌ మాట తప్పరని, మడమ తిప్పరని చెప్పారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తేనే ముస్లింలకు మేలు జరుగుతుందని చెప్పారు.

 
Back to Top