జననేత ప్రజాధరణకు టీడీపీ వెన్నులో వణుకు

వైయస్‌ జగన్‌ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది
వైయస్‌ఆర్‌ సీపీ మండపేట కోఆర్డినేటర్‌ లీలా కృష్ణ
తూర్పుగోదావరి: ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న ప్రజాధరణ చూసి తెలుగుదేశం పార్టీ వెన్నులో వణుకుపడుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్‌ లీలా కృష్ణ అన్నారు. పాదయాత్రగా వస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని చెప్పారు. ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న లీలా కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా జిల్లాకు ప్రజా సంకల్పయాత్రకు ప్రజాధరణ పెరుగుతుందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఒక నాయకుడు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం ఇదే ప్రథమమని, వైయస్‌ జగన్‌ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇప్పటికే వైయస్‌ జగన్‌ 2500ల కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారన్నారు. జననేత ప్రకటించిన నవరత్నాలు మెచ్చి మహిళలు హారతులు పడుతున్నారన్నారు. ఖచ్చితంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకుంటామని చెబుతున్నారన్నారు. రాయవరంలో జరిగే బహిరంగ సభకు గ్రామాలు, పట్టణాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరానున్నారని లీలా కృష్ణ చెప్పారు. ఉదయం నుంచి ప్రజలు ఫోన్‌లు చేసి మేం వస్తామంటూ చెబుతున్నారన్నారు. రాయవరం ప్రాంతం వైయస్‌ జగన్‌ ఫ్లెక్సీలు, కటౌట్లతో నిండిపోయింది. 
 
Back to Top