వైయస్‌ జగన్‌ సింహం..సింగిల్‌గా వస్తారు

తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సింహం లాంటి వ్యక్తి అని..సింగిల్‌గా ఎన్నికలకు వెళ్తారన్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. చిట్టెలుకలు ఎన్ని వచ్చినా సింహాన్ని ఏమీ చేయలేవని ఆమె వివరించారు. వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర 200వ రోజులు సందర్భంగా లక్ష్మీపార్వతి జననేతను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ ఒక్కడే వీరోచితమైన పోరాటం చేస్తున్నారని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన వస్తుందని, దాన్ని చూసి టీడీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు కళ్లకు కనబడుతున్నాయని చెప్పారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అని ఆమె విమర్శించారు. చంద్రబాబు అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే రకమన్నారు. కాంగ్రెస్‌తో చేతులు క‌ల‌పాల‌ని చంద్ర‌బాబు చూస్తున్నార‌ని, ఆయ‌న్ను గోదావరిలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వైయస్‌ జగన్‌ ప్రజానాయకుడిగా ఎదిగారని, ప్రజలే ఆయన్ను ముఖ్యమంత్రిని చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
Back to Top