ఎంపీల త్యాగం అభినందనీయం

 
 కాకినాడ: ఆంధ్రపదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ప‌ద‌వుల‌కు త్యాగం చేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని,  రాష్ట్ర రాజకీయ చరిత్రలో చారిత్రక ఘట్టమని  కాకినాడ పార్లమెంటు నియోజవర్గ అధ్యక్షులు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం  వారు మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీల త్యాగాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. పదవుల కోసం పాకులాడుతున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు హోదా విషయంలో ప్రజాకోర్టు బోనులో నిలబడ్డారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అంశంగా ఉప ఎన్నికలకు చంద్రబాబు సిద్ధం కావాలన్నారు. ధైర్యం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాల్లో ఉప ఎన్నికలకు సిద్దమవ్వాలని సవాల్‌ విసిరారు.  ఎన్నికలంటే చంద్రబాబు బయపడుతున్నారని విమర్శించారు. ప్రజల సొమ్ముతో హోదా కోసం చంద్రబాబు చేస్తున్న దొంగ దీక్షలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

 
Back to Top