కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరని ద్రోహం చేశాయి

 

కాకినాడ :   విభజన హామీలు నెరవేర్చకుండా,  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరని ద్రోహం చేశాయని వైయ‌స్ఆర్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు.. ప్రత్యేక హోదా నినాదం ప్రజల్లో ఎంత బలీయంగా ఉందో సోమవారం విజయవంతంగా జరిగిన బంద్‌ రుజువు చేస్తోందన్నారు.   ప్రత్యేక హోదా రావడం ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు.  హోదా వల్ల కలిగే ప్రయోజనాలను విస్మరించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్యాకేజీల వైపు మొగ్గు చూపడం వల్లే ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయిందన్నారు.
Back to Top