తాడేపల్లెగూడెం అభివృద్ధి వైయస్‌ఆర్‌ చలువే

పశ్చిమ గోదావరి:  తాడేప‌ల్లిగూడెం అభివృద్ధి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చ‌లువే అని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు కొట్టు స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు.
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 167వ రోజు తాడేపల్లెగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు. 2004వ సంవత్సరాలకు ముందు, 2009వ సంవత్సరం తరువాత జరుగుతున్న చరిత్రను పరిశీలించాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌ పాలనలో తాడేపల్లి గూడెంలో సువర్ణ అధ్యాయం అన్నారు. తాడేపల్లిగూడెం వాణిజ్యపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతమన్నారు. ఇక్కడ ఎలాంటి మౌలిక వసతులు లేని సమయంలో ఆ నాడు వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రచారం నిమిత్తం ఇక్కడికి వచ్చిన సమయంలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చారన్నారు. నాడు తాడేపల్లిగూడెంకు దశ, దిశా లేదన్నారు. మహానేత అధికారంలోకి వచ్చాక కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాజీవ్‌ పల్లెబాట, రాజీవ్‌ నగర బాట ఇక్కడ నుంచే వైయస్‌ఆర్‌ ఇక్కడి నుంచి ప్రారంభించారన్నారు. మురికి వాడలను అభివృద్ధి చేశారన్నారు. రూ.158 కోట్లతో ఎ్రరకాల్వను ఆధునీకరించారన్నారు. ఇక్కడ హర్టికల్చర్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేశారన్నారు. ఇవాళ జరుగుతున్న వాస్తవ పరిస్థితిని గమనించాలన్నారు. టీడీపీ నేతలకు అభివృద్ధి పట్టడం లేదని, దోచుకోవడం..దాచుకోవడమే అన్నారు. టీడీపీ నాయకుల దుర్మార్గమైన ఆలోచనలను గమనించాలని కోరారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీని పూర్తి చేస్తేనే ప్రజలు ఆరోగ్యంగా జీవించగలరన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం కాగానే అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేయాలని కోరారు.
 
Back to Top