వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ కోఠారి అబ్బాయి చౌద‌రి నిరాహార దీక్ష‌


- పోటీగా చింత‌మ‌నేని అనుచ‌రుల దీక్ష‌
- వైయ‌స్ఆర్‌సీపీ దీక్షా శిబిరాన్ని తొల‌గిస్తున్న పోలీసులు
- గోప‌న్న‌పాలెంలో ఉద్రిక్త‌త‌
ప‌శ్చిమ గోదావ‌రి:  టీడీపీ దెంద‌లూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ అరాచ‌కాల‌కు నిర‌స‌న‌గా వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు కోఠారి అబ్బాయి చౌద‌రి నిరాహార దీక్ష‌కు దిగారు. దీంతో చింత‌మ‌నేని అనుచ‌రులు పోటీగా దీక్ష చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో పోలీసులు టీడీపీ నేత‌ల ఒత్తిడి మేర‌కు వైయ‌స్ఆర్‌సీపీ దీక్షా శిబిరాన్ని తొల‌గించి, కుర్చీలు తీసేశారు. దీంతో గోప‌న్న‌పాలెంలో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది.  దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రోద్భ‌లంతో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డాన్ని నిర‌సిస్తూ కొఠారి అబ్బాయి చౌద‌రి ఆందోళ‌న‌కు సిద్ధ‌ప‌డ్డారు. ఈ అంశాన్ని త‌ప్పుదారి ప‌ట్టించేందుకు చింత‌మ‌నేని కూడా త‌న వ‌ర్గీయుల‌తో పోటీగా దీక్ష శిబిరం ఏర్పాటు చేయించారు. అయితే పోలీసులు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల దీక్ష శిబిరాన్ని తొల‌గించి, టెంటు, కుర్చీలు తీసేశారు. అయితే టీడీపీ నాయ‌కుల శిబిరం వైపు పోలీసులు క‌న్నెత్తి కూడా చూడ‌లేదు. అయినా స‌రే అబ్బాయి చౌద‌రి రోడ్డుపై భైఠాయించి దీక్ష కొన‌సాగిస్తున్నారు. ఈ దీక్షా శిబిరాన్ని పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా నాయ‌కులు సంద‌ర్భించి సంఘీభావం తెలిపారు.
Back to Top