బాబు పాలనలో పల్లె ప్రజలకు అవస్థలునెల్లూరు: చంద్రబాబు పాలనలో గ్రామీణ ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ప్రజాప్రస్థానంలో భాగంగా నెల్లూరు నగర రామలింగాపురంలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కలుషిత నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తమ సమస్యను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు అభివృద్ధిని అడ్డుకుంటున్నాడన్నారు. ప్రభుత్వ నిధులను జన్మభూమి కమిటీ సభ్యులు వెనకేసుకుంటున్నారన్నారు. అవినీతి పరిపాలనతో చంద్రబాబు పేదలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని మండిపడ్డారు. ప్రజల కోసం కష్టపడుతున్న ప్రజా నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలన మళ్లీ తిరిగొస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని సూచించారు. 
 
Back to Top