బాబు పాలన రావణాసురుడిని తలపిస్తుంది

వైయస్‌ఆర్‌ సీపీ నేత కొప్పున మెహన్‌రావు
తూర్పుగోదావరి: చంద్రబాబు పరిపాలన రావణాసురుడిని తలపిస్తుందని మాజీ మంత్రి, వైయస్‌ఆర్‌ సీపీ నేత కొప్పున మోహన్‌రావు విమర్శించారు. పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే వర్మ దేవుడికి కూడా శఠగోపం పెడుతున్నారన్నారు. ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న కొప్పున మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వర్మ ఏ పని చేయాలన్నా లంచాలు డిమాండ్‌ చేస్తున్నారన్నారు. నీరు–చెట్టు పేరుతో విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఆఖరికి పెన్షన్, రేషన్, ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నా.. లంచాలు ఇవ్వాలని స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.
Back to Top