మహానేత ఆశయసాధనే జననేత లక్ష్యం

హైదరాబాద్‌: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసమే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారని తెలంగాణ వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి గుర్తు చేశారు. ఆవిర్భావ వేడుకల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ స్థాపించే సమయంలో మనం ఎత్తుకునేది వజ్రకిరీటం కాదు.. ముళ్ల కిరీటమని, ఈ దారిలో అనేక ఆటోపోటులు ఉంటాయని, కానీ అంతిమ లక్ష్యం ప్రజలకు మేలు చేయడమేనని వైయస్‌ జగన్‌ చెప్పారన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజలంతా వైయస్‌ జగన్‌ వెంటే ఉన్నారన్నారు. 2019 ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. 
Back to Top