దోచుకో..దాచుకో.. ఇదే టీడీపీ సంక్షేమం...

విజయనగరంః రాష్ట్ర ప్రజలు వైయస్‌ జగన్‌లో దివంగత మహానేత వైయస్‌ఆర్‌ను చూసుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కోగట్ల వీరభద్రస్వామి అన్నారు. జగన్‌ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. విజయనగరంలో ప్రజా సంకల్పయాత్ర 3 వేల కిలోమీటర్లు దాటడం జిల్లా ప్రజల అదృష్టమన్నారు. అభివృద్ధిలో వెనుకబడిన జిల్లా విజయనగరమని, జగన్‌తోనే జిల్లాలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన సాగడంలేదని  వైయస్‌ఆర్‌  ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను నిర్వీర్యం చేసి ఒకఒకే కార్యక్రమం జరుగుతుందని దోచుకో దాచుకో కార్యక్రమం అని ఆరోపించారు. చినబాబు దోస్తున్నాడు.. పెదబాబు దాస్తున్నాడన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి..చంద్రబాబును కాలర్‌ పట్టుకుని కిందకు దించుదామా ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. విజయనగరం జిల్లాలో ఉన్న 9 శాసన సభ స్థానాలు, మూడు పార్లమెంటు స్థానాలు వైయస్‌ జగన్‌కు బహుమతిగా ఇవ్వాలన్నారు.
 

Back to Top