నవరత్నాలను ప్రజలు నమ్ముతున్నారు


తూర్పుగోదావరి: ౖవైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను ప్రజలు నమ్ముతున్నారని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారని చెప్పారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిపై ప్రజలు ఎలాంటి నమ్మకంతో ఉన్నారో అలాంటి నమ్మకాన్ని వైయస్‌ జగన్‌ కల్పిస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌ లాగే వైయస్‌ జగన్‌ కూడా మాట నిలబెట్టుకుంటారని ఆయన తెలిపారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ప్రజల్లో బలంగా ఉందని పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో వైయస్‌ జగన్‌ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ..వారితో మమేకమయ్యారని, సీఎం కాగానే ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ చంద్రబాబు పాలనలో ఇబ్బందులు పడుతున్నారని కాటసాని తెలిపారు.హామీలు నెరవేర్చే సత్తా వైయస్‌ జగన్‌కు కుందని ప్రజలు విశ్వసిస్తున్నారని రాంభూపాల్‌రెడ్డి వివరించారు.
 
Back to Top