ఎట్టి పరిస్థితుల్లో అక్రమ మైనింగ్‌ క్వారీలు పరిశీలిస్తాం


గుంటూరు: ఎట్టి పరిస్థితుల్లో అక్రమ మైనింగ్‌ క్వారీలను పరిశీలిస్తామని వైయస్‌ఆర్‌సీపీ గురజాల ఇన్‌చార్జ్‌ కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నరసరావుపేట నుంచి గురజాలకు వైయస్‌ఆర్‌ సీపీ నేతలు బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసు మహేష్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. గనుల పరిశీలనకు వచ్చిన వైయస్‌ఆర్‌ సీపీ నేతలను అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. కాసు మహేషరెడ్డి ఇంటి ముందు భారీగా పోలీసులు మొహరించారు. 
 
Back to Top