నాలుగున్నరేళ్లుగా అరాచక పాలన

విశాఖ: రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా అరాచక పాలన సాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త కరుణం ధర్మశ్రీ మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చోడవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రజా ప్రస్థానంలో వైయస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్రగా ఈ ప్రాంతానికి వస్తే ఆ రోజు చల్లధనం కలిగిందని, అదే వాతావరణం వైయస్‌ జగన్‌ వస్తే కూడా కనిపించాయన్నారు. అన్న అడుగేస్తే చాలు ఈ రోజు భూమి పులకిస్తుంది. ఆకాశం వర్షంతో ఆశీర్వదిస్తుందని చెప్పారు.  ప్రభుత్వం ద్వారా ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు వైయస్‌ జగన్‌ మన ప్రాంతానికి వచ్చారన్నారు. అన్న కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూశామని, అన్నకు ఆహ్వానం పలికిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. చోడవరం నియోజకవర్గం గత పదేళ్లుగా దుర్మార్గమైన, అరాచకమైన పాలనలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు.  పచ్చ నేతలు ప్రకృతిని పంచుకుతింటున్నారని ఆరోపించారు. షుగర్‌ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రిజర్వాయర్లు పూర్తి చేస్తామన్నారు. ప్రత్యేక ప్రాజెక్టుకు సిమెంట్‌ లైనింగ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. షుగర్‌ ఫ్యాక్టరీని ప్రగతిపథంలో నడిపిస్తామన్నారు. యనమల రామకృష్ణుడు, అశోక్‌ గజపతిరాజు నిన్న చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేసి తనకు నిద్ర పట్టడం లేదని, జగన్‌ అనే నినాదం తనకు వినిపిస్తుందని కలవరిస్తున్నారట అని ఎద్దేవా చేశారు. రాజన్న రాజ్యం తెచ్చేందుకు జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు.  
 
Back to Top