షుగర్‌ ఫ్యాక్టరీ మూయించేందుకు చంద్రబాబు కుట్ర

విశాఖపట్నం: ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీని మూసి వేయించేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 3 లక్షల 80 వేల టన్నులు ఆడిన ఏటికొప్పాక ఫ్యాక్టరీ చంద్రబాబు హయాంలో దివాలా తీసిందన్నారు. ప్రస్తుతం 70 వేల టన్నులు కూడా ఆడడం లేని దుస్థితి నెలకొందన్నారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో పాల్గొన్న ధర్మశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ప్రాంత రైతాంగం చెరుకు, పాడి మీద ఆధారపడి జీవిస్తున్నారన్నారు. చంద్రబాబు కోఆపరేటివ్‌ వ్యవస్థలను ప్రైవేటీ కరణ చేసేందుకు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. మంత్రి అయ్యన్నపాత్రుడు ద్వారా ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీని సుజనా చౌదరికి కట్టబెట్టాలని చూస్దున్నాడన్నారు. అది కుదరకపోతే ఫ్యాక్టరీ నష్టాలు చూపి ప్రజలను మోసం చేసి మూయించే కార్యక్రమానికి పూనుకున్నాడని ఆరోపించారు. రైతులు బతికిబట్టకట్టాలంటే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నారు. వైయస్‌ జగన్‌ ప్రజలందరి సమస్యలు వింటూ అవగాహన చేసుకుంటున్నారన్నారు. 

తాజా వీడియోలు

Back to Top